మహిళా బస్సు ప్రయాణికులకు మరో శుభవార్త
రోజువారీ బస్సు ప్రయాణికులకు మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణాల సంఖ్య 20 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం కొత్త బస్సుల కొనుగోలుపై ఆర్టీసీ దృష్టి సారించింది. చివరకు బస్సుల సంఖ్యను పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది.
ఆర్టీసీ ఇప్పుడు బస్సుల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. జూన్ 15 నాటికి 150 కొత్త బస్సులు రోడ్డెక్కే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.దీనిలో 125 డీలక్స్ బస్సులు, 25 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
వచ్చే ఆరు నెలల్లో 450 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రస్తుతం ఆర్టీసీలో రోజుకు 2,900 బస్సుల్లో 20 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు డిసెంబరు నాటికి బస్సుల సంఖ్యను 3,500కు పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ బస్సుల సంఖ్య పెరిగితే ప్రయాణికుల సంఖ్య కూడా 30 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. జూన్ నెలలో వచ్చే డీలక్స్ బస్సుల్లో 2/2 సీటింగ్ కెపాసిటీ ఉండే అవకాశం ఉంది. కొత్త బస్సులను కొనుగోలు చేసిన వెంటనే అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.