మీరు ఎస్‌బి‌ఐ లో ఉన్న ఎఫ్‌డి పథకంలో లక్ష రూపాయిలు పెట్టుబడి పెడితే మీకు ఎంత లభిస్తుంది

ఎస్‌బి‌ఐ దేశంలో అతి పెద్ద ప్రభుత్వ రంగా బ్యాంకు. ఇటీవల ఎస్‌బి‌ఐ బ్యాంకులో రూ.3 కోట్లు కన్నా తక్కువ ఫిక్సెడ్ డెపోజిట్ మీద వడ్డీ రేట్లు పెంచారు. కొత్త వడ్డీ రేట్లు జూన్ 15,2024 నుండి మార్పులు చేశారు. ఎస్‌బి‌ఐ వారి ఒఫిషియల్ వెబ్సైట్ లో కూడా ఈ మార్పులు ప్రకటించారు.

స్టేట్ బ్యాంక్ ఒఫ్ ఇండియా ఇటీవల 25 బేసిస్ పాయింట్లు పెంచారు. 25 బేసిస్ పాయింట్లు పెంచడం వల్ల, ఇప్పటివరకు 6 శాతం ఉండేది, సవరించిన తరువాత 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. మీకు 6.25 శాతం వడ్డీ 180 నుండి 210 రోజుల పదవీకాలం మీద లభిస్తుంది.

అదే మీరు 211 రోజులు నుండి ఒక్క సంవత్సరం పదవీకాలం మీద 6.25 శాతం నుండి 6.50 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్లు ఈ పెట్టుబడి పదవీకాలం మీద పెంచారు.

లక్ష రూపాయిలు పెట్టుబడి మీద మెచూరిటీ ఎంత వస్తుంది?

మీరు రూ.1 లక్ష 180 రోజులు నుండి 210 రోజుల పెట్టుబడి పెడితే, ప్రస్తుతం 6.25 శాతం వడ్డీ అందిస్తున్నారు. మెచూరిటీ తరువాత రూ.3,379 వడ్డీ లభిస్తుంది. అదే మీరు సీనియర్ సిటిజెన్ అయితే, మీకు మెచూరిటీ తరువాత రూ.3,652 అంటే 6.75 శాతం వడ్డీ లభిస్తుంది.

అదే మీరు 211 రోజులు నుండి ఒక్క సంవత్సరం పదవీకాలం ఎంచుకుంటే, 6.50 శాతం సామాన్య ప్రజలకు లభిస్తుంది. మెచూరిటీ తరువాత రూ.6,208 వస్తుంది. ఏ సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీ మరియు మెచూరిటీ తరువాత రూ.6,685 లభిస్తుంది.

ఈ మార్పులు ఆర్‌బి‌ఐ నిర్వహించిన MPC సమాచారంలో తీసుకున్న నిర్ణయం వల్ల ఎస్‌బి‌ఐ బ్యాంకులో వడ్డీ రేట్లు సవరించారు. మరియు సామాన్య ప్రజలకు 25 బేసిస్ పాయింట్లు పెంచారు మరియు సీనియర్ సిటిజన్లకు 75 బేసిస్ పాయింట్లు పెంచారు.

Leave a Comment