ఈ మూడు బ్యాంకుల్లో ప్రత్యేక ఎఫ్‌డి పథకాలు ప్రారంభించారు అందులో లక్ష రూపాయలు మీద ఎంత వడ్డీ లభిస్తుంది

ఆర్‌బి‌ఐ రేపో రేట్లు పెంచుతూ ఉన్నారు, ఈ కారణం వల్ల అన్నీ బ్యాంకులు ఎఫ్‌డి మీద వడ్డీ రేట్లు పెంచుతున్నారు. ఇప్పుడు ఎఫ్‌డి మీద మీకు అన్నీ బ్యాంకుల్లో ప్రత్యేక పథకాలు అందిస్తున్నారు, దీనివల్ల మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది.

ఈ ప్రత్యేక పథకంలో మీకు నిర్ణీత కాల పరిమితి మీద మీకు ఎక్కువ వడ్డీ అందిస్తారు. ప్రజలకు ఈ బ్యాంకుల్లో 8 శాతం వరకు గరిష్టమైన వడ్డీ లభిస్తుంది. మరియు సీనియర్ సిటిజన్లకు నిభంధనల ప్రకారం 50 బేసిస్ పాయింట్లు నటే 0.50 శాతం ఎక్కువ వడ్డీ అందిస్తారు.

ఐ‌డి‌బి‌ఐ బ్యాంక్:

ఐ‌డి‌బి‌ఐ బ్యాంకులో ఉత్సవ్ ఫిక్సెడ్ డెపోజిట్ అనే పథకం ప్రారంభించారు. మీరు ఈ పథకంలో డెపోజిట్ చేయాలి అంటే, మీరు మీ దగ్గరలో ఉన్న ఐ‌డి‌బి‌ఐ బ్యాంకుకి వెళ్ళి ఈ పథకం మీద మీరు జూన్ 30,2024 లోపు డెపోజిట్ చేసుకోవచ్చు.

ఈ బ్యాంక్ పథకంలో మీకు 300 రోజుల పదవీకాలం మీద సామాన్య ప్రజలకు 7.05 శాతం వడ్డీ లభిస్తుంది. అదే మీరు సీనియర్ సిటిజెన్ అయితే, మీకు 7.55 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ బ్యాంకులో లక్ష రూపాయలు డెపోజిట్ చేస్తే, మెచూరిటీ తరువాత మీకు వడ్డీ రూ.5,495 మరియు రూ.5,882 లభిస్తుంది.

375 రోజుల పదవీకాలం మీద సామాన్య ప్రజలకు 7.10 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.60 శాతం వడ్డీ అందిస్తున్నారు. మీరు ఈ పథకంలో రూ.1 లక్ష డెపోజిట్ చేస్తే, మెచూరిటీ తరువాత వడ్డీ రూ.7,283 మరియు రూ.7,737 లభిస్తుంది.

అదే మీరు 444 రోజుల ప్రత్యేక పథకం ఎంచుకుంటే, సామాన్య ప్రజలకు 7.20 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.70 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు ఈ పథకంలో రూ.1 లక్ష రూపాయలు డెపోజిట్ చేస్తే, మెచూరిటీ తరువాత మీకు రూ.8,770 మరియు రూ.9,376 లభిస్తుంది.

ఇండియన్ బ్యాంక్:

ఇండియన్ బ్యాంకులో రెండు పథకాలు ఉంది, అందులో ఒకటి IND Supreme 300 రోజుల పథకం మరియు రెండో పథకం IND Super 400 రోజుల పథకం ప్రారంభించారు. మొదటి పథకం మీద సామాన్య ప్రజలకు 7.05 శాతం వడ్డీ మరియు సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు మొదటి పథకంలో లక్ష రూపాయలు డెపోజిట్ చేస్తే, మెచూరిటీ తరువాత మీకు రూ.5,495 మరియు రూ.5,882 వడ్డీ లభిస్తుంది.

మీరు 400 రోజుల పదవీకాలం, అంటే రెండో పథకం ఎంచుకుంటే, సామాన్య ప్రజలకు 7.25 శాతం మరియు సీనియర్ సిటిజన్లకు 7.75 శాతం వడ్డీ లభిస్తుంది. మీరు సూపర్ సీనియర్ సిటిజెన్ అయితే, మీకు 8 శాతం వడ్డీ లభిస్తుంది.

మీరు 400 రోజుల పథకం ఎంచుకొని మీరు రూ.1 లక్ష డెపోజిట్ చేస్తే, మెచూరిటీ తరువాత మీకు వడ్డీ రూ.7,935, రూ.8,480 మరియు రూ.8,757 లభిస్తుంది. ఈ బ్యాంకులో కూడా మీరు పథకంలో డెపోజిట్ చేయాలి అంటే చివరి తేదీ జూన్ 30,2024.

పంజాబ్ సింధ్ బ్యాంక్:

ఈ బ్యాంకులో మీకు మూడు ప్రత్యేక ఎఫ్‌డి పథకాలు లభిస్తుంది, 222 రోజులు, 333 రోజులు మరియు 444 రోజులు. ఇందులో సామాన్య ప్రజలకు 7.05 శాతం, 7.10 శాతం మరియు 7.25 శాతం వడ్డీ లభిస్తుంది. అదే మీరు సీనియర్ సిటిజెన్ అయితే, మీకు 0.50 శాతం ఎక్కువ వడ్డీ అన్నీ పథకాలు మీద లభిస్తుంది.

ఎస్‌బి‌ఐ లో కూడా ఒక్క పథకం ప్రారంభించారు, పేరు ఎస్‌బి‌ఐ అమృత్ కాలాష్ స్పెషల్ ఫిక్సెడ్ డెపోజిట్ పథకం. ఈ పథకంలో మీరు డెపోజిట్ చేయాలి అనుకుంటే చివరి తేదీ సెప్టెంబర్ 30,2024. ఈ 400 రోజుల పథకం మీద 7.10 శాతం మరియు 7.60 శాతం సామాన్య ప్రజలకు మరియు సీనియర్ సిటిజన్లకు లభిస్తుంది. ఎస్‌బి‌ఐ వీ కేర్ పథకం, ఈ పథకంలో సీనియర్ సిటిజెన్ మాత్రమే డెపోజిట్ చేసుకోవచ్చు, ఇందులో 7.50 శాతం వడ్డీ లభిస్తుంది.

Leave a Comment