సీనియర్ సిటిజన్లకు డబ్బు పొదుపు చేయడానికి ఒక్క మంచి ఎంపిక ఎఫ్‌డి ఖాతాలో మీ డబ్బు జమ చేసుకుంటే, మీకు మంచి వడ్డీతో పాటు బ్యాంకుల్లో ఎన్నో పథకాలు అందిస్తున్నారు. సీనియర్ సిటిజన్లకు బ్యాంకుల్లో ఉన్న అన్నీ పథకాలు మీద 50 బేసిస్ పింట్లు అంటే 0.50 శాతం ఎక్కువ వడ్డీ లభిస్తుంది.
ఆర్‌బిఐ వరసగా ఎనిమిదో సారి కూడా రేపో రేట్లు మీద ఎటువంటి మార్పులు చేయలేదు, దీనివల్ల బ్యాంకుల్లో ఎఫ్‌డి రేట్లు సవరించారు మరియు కొత్త వడ్డీ రేట్లు ఒఫిషియల్ వెబ్సైట్ లో ప్రకటించారు. MPC సమాచారంలో ఆర్‌బిఐ తీసుకున్న నిర్ణయం వల్ల ప్రముఖ బ్యాంకుల్లో ఎఫ్‌డి వడ్డీ రేట్లు మీద మార్పులు చేశారు.
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ప్రముఖ ప్రైవేట్ రంగా బ్యాంకు, సవరించిన తరువాత ఈ బ్యాంకులో ఎఫ్‌డి మీద 3.50 శాతం నుండి 7.75 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మీరు 7 రోజులు నుండి 10 సంవత్సరాల పదవీకాలం ఎంచుకోవచ్చు. ఎఫ్‌డిలో మీరు ఇప్పుడు రూ.3 కోట్లు వరకు బుల్క్ డెపోజిట్ చేసుకోవచ్చు.
ఈ బ్యాంకులో మీకు 18 నుండి 21 నెలల పదవీకాలం మీద ఎక్కువ వడ్డీ రేటు అందిస్తున్నారు. ఈ కొత్త వడ్డీ రేట్లు జూన్ 19,2024 నుండి ప్రారంభించారు. మీరు ఈ బ్యాంకులో రూ.1 లక్ష డెపోజిట్ చేస్తే, మీకు వడ్డీ రూ.11,176 లభిస్తుంది.
బంధన్ బ్యాంక్
ఈ బ్యాంకులో సీనియర్ సిటిజన్లకు 3.75 శాతం నుండి 8.35 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. మీరు సంవత్సరాలు పాటు ఎఫ్‌డి ద్పోజిత్ చేస్తే, మీకు గరిష్టమైన వడ్డీ 8.35 శాతం అభిస్తుంది. మీరు ఈ బ్యాంకులో రూ.1 లక్ష డెపోజిట్ చేస్తే, మీకు వడ్డీ రూ.7,885 లభిస్తుంది.
ఇందుస్లాండ్ బ్యాంక్
ఈ బ్యాంకులో 4 శాతం నుండి 8.25 శాతం వరకు వడ్డీ ఎఫ్‌డి మీద అందిస్తారు. ఒకటి లేదా రెండు సంవత్సరాల పదవీకాలం మీద ఎఫ్‌డిలో మీకు గరిష్టమైన వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంకులో ఎఫ్‌డి మీద మార్పులు మే 27,2024 నుండి ప్రారంభించారు. ఒక్క సంవత్సరం పదవీకాలం మీద వడ్డీ రూ.7,765 లభిస్తుంది.
ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఈ బ్యాంకులో ఎఫ్‌డి మీద 4.60 శాతం నుండి 9.10 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంకులో మీరు 1500 రోజుల పదవీకాలం ఎంచుకొని మీరు డెపోజిట్ చేస్తే, మీకు 9.10 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ మార్పులు జూన్ 7,2024 నుండి ప్రారంభించారు. ఈ బ్యాంకులో మీరు రూ.1 లక్ష 1500 రోజుల వరకు డెపోజిట్ చేస్తే, మీకు వడ్డీ రూ.37,400 లభిస్తుంది.
ఉనిటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
ఉనిటి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మీకు ఎక్కువ వడ్డీ లభిస్తుంది. ఈ బ్యాంకులో మీకు 1001 రోజుల పదవీకాలం మీద 9.50 శాతం వడ్డీ లభిస్తుంది. మే 1,2024 నుండి కొత్త వడ్డీ రేట్లు అమలలోకి వచ్చింది. 1001 రోజుల పదవీకాలం మీద మీకు వడ్డీ రూ.26,125 లభిస్తుంది.
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్
నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో మీకు 546 రోజులు నుండి 1111 రోజుల పదవీకాలం మీద 9.50 శాతం వడ్డీ లభిస్తుంది. కొత్త వడ్డీ రేట్లు ఈ బ్యాంకులో జూన్ 7,2024 నుండి ప్రారంభించారు. మీరు 546 రోజుల పదవీకాలం వరకు మీరు డెపోజిట్ చేస్తే, మీకు వడ్డీ రూ.14,410 లక్ష రూపాయల డెపోజిట్ మీద లభిస్తుంది.